న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఇవాళ షాకింగ్ మర్డర్ ఘటన జరిగింది. అబోహర్ సిటీలో న్యూ వియర్ వెల్ షోరూమ్ ఓనర్ సంజయ్ వర్మను కాల్చి చంపారు(Shot Dead). ఉత్తర భారతంలో న్యూ వియర్ వెల్ కంపెనీ దుస్తులకు పేరున్నది. అయితే ఇవాళ పట్టపగలే ఈ ఘటన చోటుచేసుకున్నది. స్వంత షోరూమ్ ముందే అతన్ని హతమార్చారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ముగ్గురు వ్యక్తులు మోటర్‌బైక్‌పై వచ్చి .. షోరూమ్ ముందే వర్మపై ఫైరింగ్‌కు పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారీ అయ్యారు.
పరారీ అయిన దుండగులు కొంత దూరం పరుగు తీసి ఆ తర్వాత ఓ మోటర్‌సైకిల్‌ను ఎత్తుకెళ్లారు. షాపు నుంచి బయటకు రాగానే వర్మపై కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల శబ్ధం వినబడగానే.. స్థానిక షాపుఓనర్లు, పాదచారులు భయంతో పరుగులు తీశారు. క్రిటికల్ కండీషన్లో వర్మను ఆస్పత్రికి తరలించారు. కానీ అతను మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. షూటింగ్‌కు పాల్పడి పరారీ అయిన అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల్ని పట్టుకోనున్నట్లు చెప్పారు. ఏ ఉద్దేశంతో హత్య చేశారో ఇంకా తెలియరాలేదు. ఉత్తర భారత దేశంలో న్యూ వియర్ వెల్ కంపెనీకి ప్రత్యేక పేరున్నది. ఆ షాపు కస్టమర్లలో ఎక్కువగా సివిల్, పోలీస్, జుడిషియల్ ఆఫీసర్లు ఉన్నారు. వర్మహత్య నేపథ్యంలో స్థానిక మార్కెట్‌ను ఇవాళ బంద్ చేశారు.