వారణాసి: వందేభారత్(Vande Bharat) కొత్త ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. వారణాసి నుంచి ఢిల్లీ మధ్య ఆ రైలు తిరుగనున్నది. ఈ రూట్లో ప్రారంభించిన రెండో వందేభారత్ రైలు అది. అయితే ఆ రైలు బ్లూ, వైట్ కలర్లోనే ఉన్నది. కానీ ఇటీవల వందేభారత్ రైలుకు చెందిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. వందేభారత్ రైలు కాషాయ రంగులో ఉండనున్నట్లు నార్తర్న్ రైల్వేకు చెందిన బ్రౌచర్లు రిలీజ్ అయ్యాయి. వైట్ అండ్ బ్లూ కలర్లో ఉన్న వందేభారత్ రైలును భవిష్యత్తులో కాషాయ రంగులో చూడనున్నట్లు ఇటీవల ఓ సీనియర్ అధికారి తెలిపారు.
వందేభారత్ రైలుకు ఉన్న రంగులపై వివాదం చెలరేగడంతో ఆ అంశంపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. కాషాయ రంగు రైలును ప్రారంభించాలన్న ఆలోచనలేదన్నారు. దీంట్లో రాజకీయం ఏమీలేదన్నారు. కేవలం శాస్త్రీయ కోణంలో మాత్రమే రైలు రంగును ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. మనుషుల కండ్లకు పసుపు, నారింజ రంగు ఎక్కువగా కనిపిస్తాయని, యూరోప్‌లో 80 శాతం రైళ్లకు ఇదే కలర్ ఉంటుందని, ఎల్లో లేదా ఆరెంజ్కలరే ఉంటుందని మంత్రి వైష్ణవ్ చెప్పారు.