న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) సెమీ హైస్పీడ్ రైళ్లకు ‘నమో భారత్’గా నామకరణం చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ-ఘజియాబాద్- మీరట్ కారిడార్లోని 17 కిలోమీటర్ల సెక్షన్ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు.
ఈనెల 21 నుంచి ఇవి ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఇవి ప్రతి 15 నిమిషాలకు ఒకటి అందుబాటులో ఉంటాయని పీఎంవో తెలిపింది.