Indian Railways | న్యూఢిల్లీ: స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణం కోసం బెర్త్ రిజర్వు కానటువంటి, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించాలి. వీరు స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించడానికి ఈ టికెట్లు చెల్లవు. ఒకవేళ వెయిటింగ్ లిస్టెడ్ టికెట్లతో స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా చెల్లించక తప్పదు.
ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు ఆ టికెట్లతో ఏసీ బోగీలో ప్రయాణిస్తే, ఆ రైలు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడి నుంచి తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని, రూ.440 ఫైన్‌ను చెల్లించాలి. స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే, రూ.250 జరిమానాతోపాటు, తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని చెల్లించాలి.