బుధవారం 20 జనవరి 2021
National - Dec 05, 2020 , 17:48:16

ఇదీ కొత్త పార్ల‌మెంట్ డిజైన్‌..!

ఇదీ కొత్త పార్ల‌మెంట్ డిజైన్‌..!

న్యూఢిల్లీ: ప్ర‌స్తుత పార్ల‌మెంట్ స్థానంలో కేంద్రం కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని నిర్మంచ‌బోతున్న‌ది. ఈ నిర్మాణానికి సంబంధించి ఈ నెల 10న శంకుస్థాప‌న చేసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నానికి సంబంధించిన డిజైన్‌ను లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా వెల్ల‌డించారు. ‌HCP డిజైన్‌, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నూత‌న పార్ల‌మెంట్ డిజైన్‌ను రూపొందించింద‌ని ఓం బిర్లా తెలిపారు. కాగా, మొత్తం 64,500 చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణంలో రూ.971 కోట్ల ఖ‌ర్చుతో నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని నిర్మించ‌నున్నారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి ఈ భ‌వ‌న నిర్మాణ కాంట్రాక్టును అప్ప‌గించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo