ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చిన కొత్త ఐటీశాఖ మంత్రి

న్యూఢిల్లీ : కేంద్ర ఐటీశాఖ మంత్రిగా ఇవాళే బాధ్యతలు చేపట్టిన అశ్విని వైష్ణవ్.. వచ్చీ రాగానే సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేలపై రూపుదిద్దుకున్న చట్టాలే అత్యున్నతమని, కచ్చితంగా కొత్త ఐటీ రూల్స్‌ను ట్విట్టర్ పాటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇటీవల ట్విట్టర్ సంస్థకు, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మాజీ ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా పలు మార్లు ట్విట్టర్‌కు ఇలాంటి వార్నింగ్‌లే ఇచ్చారు. కానీ ట్విట్టర్ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు.
ఇవాళ ఢిల్లీ హైకోర్టులోనూ ట్విట్టర్ కేసు విచారణకు వచ్చింది. 8 వారాల్లోగా గ్రీవియన్స్ ఆఫీసర్‌ను నియమించనున్నట్లు ఆ సంస్థ కోర్టుకు చెప్పింది. రూల్స్ పాటించడం లేదని కోర్టు హెచ్చరించిన రెండు రోజుల తర్వాత ట్విట్టర్ ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రీవియన్స్ ఆఫీసర్‌ను పెట్టాలని కేంద్రం కోరినా.. ట్విట్టర్ మాత్రం స్పందించడంలేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఆ సంస్థకు వార్నింగ్ ఇచ్చింది. కావాల్సినం సమయం ఇవ్వలేమని హైకోర్టు జస్టిస్ రేఖా పాలి తన తీర్పులో అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

