ఇంకెప్పుడూ మహిళను ఎగతాళి చేయకు.. ప్రధాని మోదీకి టీఎంసీ నేత సలహా
Derek O Brien: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డెరిక్ ఓబ్రియాన్ గుర్తుచేశారు.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే మరోసారి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. మొత్తం 294 స్థానాలకుగాను 292 స్థానాల్లో కౌంటింగ్ జరుగుతుండగా తృణమూల్ ఇప్పటికే 102 స్థానాల్లో విజయం సాధించింది. మరో 110 స్థానాల్లో ఆధిక్యంతో కొనసాగుతున్నది. దాంతో బెంగాల్లో టీఎంసీ హ్యాట్రిక్ విజయం ఖాయమైంది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డెరిక్ ఓబ్రియాన్ గుర్తుచేశారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రచార సభల్లో మమతాబెనర్జీని ఎగతాళి చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు ఓ ర్యాలీలో మమతాబెనర్జిపై ప్రధాని వ్యంగ్య వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దానికి మా రాష్ట్రంలోగానీ, మరెక్కడైనాగాని ఇంకెప్పుడూ మహిళను ఎగతాళి చేయకు అని క్యాప్షన్ ఇచ్చారు.
Never taunt a woman in my State or anywhere else. Never ever. pic.twitter.com/XB3kM81HZ1
— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) May 2, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

