భువనేశ్వర్: తన జీవితంలో ఇన్ని మృతదేహాలు ఎప్పుడూ చూడలేదని ఒడిశా అగ్నిమాపక అధికారి తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం (Odisha train tragedy) గురించి ఒడిశా ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సుధాన్షు సారంగి మీడియాతో మాట్లాడారు. క్రేన్లను రప్పించి శిథిలమైన బోగీలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నట్లు చెప్పారు. అయితే శిథిల బోగీల్లో జీవించి ఉన్న వారు ఎవరూ ఉండకపోవచ్చని అన్నారు. జీవితంలో ఇన్ని మృతదేహాలను ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఘోర రైలు ప్రమాద సంఘటన ఎంతో నిరాశ పర్చిందని అన్నారు.
కాగా, బాలాసోర్ ఆసుపత్రిలోని ఒక గదిలో ఉంచిన వందలాది మృతదేహాలు, రైలు పట్టాల పక్కన ఉంచిన పదుల సంఖ్యలోని మృతదేహాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 288 మంది మరణించగా, 803 మంది ప్రయాణికులు గాయపడినట్లు అధికారికంగా ప్రకటించారు.
.
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం మూడు రైళ్లు ఢీకొన్నాయి. లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నది. దాని కంపార్ట్మెంట్లు మెయిన్ లైన్‌పై పడ్డాయి. అయితే కొన్ని నిమిషాల్లోనే మెయిన్ లైన్లో వస్తున్న యశ్వంత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ మొత్తం ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 300కు పైగా ఉంటుందని, వెయ్యి మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లు అనధికారికంగా తెలుస్తున్నది.
#WATCH | "…A crane has arrived, we will pull up (coaches) one by one but we don't expect any survivors under them. We are disheartened, we had never seen so many bodies in our life..," says Odisha's Director General, Fire Services, Sudhanshu Sarangi, on #BalasoreTrainAccident pic.twitter.com/NhUumiWzOy
— ANI (@ANI) June 3, 2023
#WATCH | Odisha: Restoration work is underway at the site of #BalasoreTrainAccident as wreckage and mangled coaches of derailed trains are being moved away from the track.
Death toll in the incident stands at 288 with 747 people injured along with 56 grievously injured so far. pic.twitter.com/3tzdV5jWJk
— ANI (@ANI) June 3, 2023