న్యూఢిల్లీ: ఇటీవల వెనక్కి తీసుకొన్న సాగు చట్టాలను మళ్లీ తెస్తామన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంత్రి యూటర్న్ తీసుకొన్నారు. చట్టాలను తిరిగి తీసుకొచ్చే ఆలోచన కేంద్రానికి లేదంటూ మాటమార్చారు. ఒకడుగు వెనక్కి వేసిన ప్రభుత్వం పెద్ద అడుగు ముందుకు వేస్తుందన్న తన మాటలకు వక్రభాష్యం చెప్పారని పేర్కొన్నారు. సాగు చట్టాలపై వెనుకడుగు వేసినా.. రైతుల సంక్షేమం ముందుకు సాగుతుందన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశానంటూ సమర్థించుకున్నారు.