న్యూఢిల్లీ: వై కేటగిరీ భద్రతను తాను కోరలేదని, అది తనకు అవసరం లేదని ఆప్ రెబల్ నేత కుమార్ విశ్వాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన భద్రత గురించి అధికారుల నుంచి ఎలాంటి సందేశం రాలేదని చెప్పారు. అయితే పౌరుల భద్రత గురించి ఆలోచించడం ప్రభుత్వాల పని అని అన్నారు.
మరోవైపు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌తో తాను మాట్లాడటం లేదని కుమార్ విశ్వాస్ తెలిపారు. ఖలిస్తానీలను వ్యతిరేకిస్తానని ఆయన చెప్పడం లేదని విమర్శించారు. కేజ్రీవాల్ అలా చెబితే ఆయనపై పెట్టుబడి పెట్టిన వ్యక్తులు అసంతృప్తి చెందుతారని ఎద్దేవా చేశారు. నేను కోపంతో చెప్పింది సరైందేనని ఆయన స్పందనతో రుజువైందన్నారు. తాను ఆప్‌కు రాజీనామా చేయలేదన్న కుమార్ విశ్వాస్, తనను తొలగించే సామర్థ్యం కేజ్రీవాల్‌కు లేదన్నారు.