న్యూఢిల్లీ, ఆగస్టు 5: నీట్ యూజీ-2025 మొదటి రౌండ్ కౌన్సెలింగ్ కోసం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) మంగళవారం సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది. దీని ప్రకారం, అధికారిక వెబ్సైట్ mcc.nic.inలో రిజిస్ట్రేషన్ విండో బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. నేడు సాయంత్రం 6 గంటలకల్లా చెల్లింపు ప్రక్రియను పూర్తిచేయాలి. గురువారం ఉదయం 8 గంటలకల్లా చాయిస్ ఫిల్లింగ్, ఆగస్టు 6 రాత్రి 8 నుంచి ఆగస్టు 7 ఉదయం 8 గంటల వరకు చాయిస్ లాకింగ్ అందుబాటులో ఉంటుందని ‘ఎంసీసీ’ ఒక ప్రకటనలో పేర్కొన్నది. తొలి రౌండ్ సీటు కేటాయింపు ఫలితాలను ఆగస్టు 9న ప్రకటించనున్నారు. ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 9-18 మధ్య వారి వారి వైద్య విద్యా సంస్థల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.