కోటా, జనవరి 17: రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజ్ఞాన్ నగర్లోని అంబేద్కర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన అభిజిత్ గిరి 2024 ఏప్రిల్ నుంచి ఇక్కడి ఓ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు.
గురువారం రాత్రి భోజనాన్ని అందచేయడానికి హాస్టల్ గదికి వచ్చిన మెస్ కార్మికుడికి తలుపు ఎంతకూ తెరవకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా లోపల ఫ్యానుకు ఉరేసుకుని అభిజిత్ కనిపించాడని పోలీసులు చెప్పారు.