
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: నీట్-సూపర్ స్పెషాలిటీ(నీట్-ఎస్ఎస్) ఎంట్రన్స్‌లో సిలబస్ మార్పు నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేసింది. పాత పద్ధతిలోనే ఈ ఏడాది పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా పరీక్ష విధానంలో మార్పులను వచ్చే ఏడాది నుంచి (2022-23 విద్యా సంవత్సరం) అమలు చేస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపిన సమాచారాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం రికార్డు చేసింది. సిలబస్‌లో మార్పును వ్యతిరేకిస్తూ 41 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. నీట్-ఎస్ఎస్ పరీక్ష నవంబర్ 13-14న జరుగనున్నది.