న్యూఢిల్లీ : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నీట్-పీజీ 2026, నీట్-ఎండీఎస్ 2026 తాత్కాలిక షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం, నీట్-ఎండీఎస్ మే 2న జరుగుతుంది. నీట్-పీజీ ఆగస్టు 30న జరుగుతుంది.
ఇవి కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు. ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా సజావుగా జరిగే విధంగా పరీక్షా కేంద్రాలను నిర్ణయిస్తారు. నీట్-ఎండీఎస్కు ఇంటర్న్షిప్ పూర్తికావడానికి కటాఫ్ డేట్ మే 31, నీట్-పీజీకి ఇంటర్న్షిప్ పూర్తి కావడానికి కటాఫ్ డేట్ సెప్టెంబర్ 30.