న్యూఢిల్లీ, నవంబర్ 27: వచ్చే ఏడాది జరిగే నీట్ ఎండీఎస్, నీట్ ఎస్ఎస్ పరీక్షలతోపాటు ముఖ్యమైన పలు ఇతర పరీక్షల తేదీలను ఎన్బీఈఎంఎస్ (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్) తాత్కాలికంగా ప్రకటించింది. జనవరి 31న నీట్ ఎండీఎస్, మార్చి 29-30న నీట్ ఎస్ఎస్ పరీక్షలను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. వీటితోపాటు ఫారిన్ డెంటల్ స్క్రీనింగ్ టెస్ట్ (ఎఫ్డీఎస్టీ), ఫార్మాటివ్ అసెస్మెంట్ టెస్ట్ (ఎఫ్ఏటీ), డీఎన్బీ (బోర్డ్ స్పెషాలిటీ) ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్, ఫెలోషిప్ ఎంట్రెన్స్ టెస్ట్-2024 తదితర పరీక్షల తేదీలను ప్రకటించింది. పరీక్షల షెడ్యూల్ను ఎన్బీఈ. ఈడీయూ. ఐఎన్లో చూడొచ్చు.