కోల్‌కతా : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్ జనరల్, ‘పద్మ భూషణ్’ సరోజ్ ఘోష్ కన్నుమూశారు. ఎన్సీఎస్ఎం ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయన అమెరికాలోని సియాటెల్‌లో శనివారం తుది శ్వాస విడిచారు.
1979-1997 మధ్య కాలంలో ఎన్సీఎస్ఎం డీజీగా ఆయన దేశవ్యాప్తంగా సైన్స్ సెంటర్ల నెట్వర్క్ ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారు. ఆయన కోరిక మేరకు ఆయన పార్థివ దేహాన్ని పరిశోధనల కోసం వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.