న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీసీ-ఎస్) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఏక్నాథ్రావు ఖడ్సే రాష్ట్రపతి ముర్ముకు ఓ వింత అభ్యర్థన చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాల అణచివేతకు ఎలాంటి శిక్ష పడకుండా.. ఒక హత్య చేయడానికి మహిళలకు అనుమతి ఇవ్వాలని కోరారు. రెండు రోజుల క్రితం ముంబైలో ఓ బాలికపై లైంగిక దాడి జరిగిందని.. మానవ మృగాల్లో ఉన్న దుర్మార్గమైన ఆలోచనను అంతమొందించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఖడ్సే కోరారు.
లిప్స్టిక్తోపాటు కత్తి, కారం తీసుకెళ్లండి ; మహారాష్ట్ర మంత్రి సూచన
జలగావ్: మహిళలు తమ పర్సులో లిప్స్టిక్తోపాటు కత్తి, కారం పొడి వెంట తీసుకెళ్లాలని మహారాష్ట్ర మంత్రి గులాబ్రావ్ పాటిల్ సూచించారు. స్వీయ రక్షణ కోసం దీనిని పాటించాలన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న ఘోరాలు, నేరాల తీరును ప్రస్తావించారు. ఇటీవల పుణెలో 26 ఏండ్ల మహిళపై జరిగిన లైంగికదాడిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.