Maharashtra Elections | ముంబై, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని పర్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ధంజయ్ ముండేపై పోటీ చేస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ శరద్ చంద్ర పవార్ పార్టీ అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్ముఖ్ అబ్బాయిలందరికీ పెళ్లి చేస్తానని విచిత్రమైన హామీ ఇచ్చారు.
ఆయన తన ప్రచారంలో ‘నేను ఎమ్మెల్యేగా గెలిస్తే.. అబ్బాయిలందరికీ పెళ్లిళ్లు చేస్తాను. అబ్బాయిలందరికీ ఉద్యోగం ఇప్పిస్తాను’ అని హామీ ఇస్తున్నారు. గతంలో రాజేసాహెబ్ దేశ్ ముఖ్ కాంగ్రెస్ బీడ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.