NCP Crisis | ఎన్సీపీ సంక్షోభం.. నేడు ఢిల్లీలో శరద్ పవార్ నేతృత్వంలో జాతీయ కార్యవర్గం భేటీ..!
NCP Crisis | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పార్టీలో నెలకొన్న సంక్షోభం నేతృత్వంలో.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ గురువారం ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చారు. పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల నేతలు భేటీకి హాజరుకానున్నారు.
NCP Crisis | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పార్టీలో నెలకొన్న సంక్షోభం నేతృత్వంలో.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ గురువారం ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చారు. పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల నేతలు భేటీకి హాజరుకానున్నారు. మహారాష్ట్రలో ఆ పార్టీ నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేయడంతో.. రెండు వర్గాలుగా పార్టీ విడిపోయింది. ఈ క్రమంలో పవార్ ఈ సమావేశంతో నేతలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు, పార్టీని చీల్చడంలో పవార్ విజయవంతమయ్యారు. జులై 2న ఎన్సీపీ చీలిక అనంతరం రెండు వర్గాలు బుధవారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి, తమ బలాబలాన్ని చాటుకున్నాయి.
మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలలో 32 మంది అజిత్ వర్గం సమావేశానికి హాజరయ్యారు. అదే సమయంలో శరద్ పవార్ వర్గం సమావేశానికి 16 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు శాసనమండలి సభ్యులు, నలుగురు ఎంపీలు హాజరయ్యారు. ఇక పార్టీ, ఎన్నికల గుర్తుపై ఇరువర్గాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. అజిత్ వర్గం తనకు మద్దతుగా 40 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు ఉందని అఫిడవిట్లను ఇచ్చింది. పలువురు ఎమ్మెల్సీలు సైతం మద్దతు తెలిపారు. మరోవైపు దక్షిణ ముంబైలోని యశ్వంతరావ్ చవాన్ ప్రతిష్ఠాన్‌లో జరిగిన సమావేశంలో శరద్ పవార్ అజిత్‌పై విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు అవమానాల్ని భరించానని, అతను (శరద్ పవార్) మహారాష్ట్రలో పర్యటిస్తే తాను సైతం పర్యటించి తగిన సమాధానం ఇస్తానన్నారు.
మరో వైపు శరద్ పవార్ స్పందిస్తూ.. ఎన్నికల గుర్తు ఎక్కడికీ పోదని, ఎక్కడికీ వెళ్లవమన్న ఆయన.. తాను లేకుండా వారి నాణెం పరుగెత్తదన్నారు. అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమ వెంటే ఉన్నారన్నారు. జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలన్నారు. ఎన్సీపీ రూ.70వేల కోట్ల కుంభకోణం చేసిందని ప్రధాని అన్నారని, ఈ ఆరోపణ నిరాధారమని శరద్ పవార్ పేర్కొన్నారు. ఒకవైపు మా పార్టీ నేతలను విమర్శలు చేస్తూనే.. రెండు రోజుల కిందట మహారాష్ట్ర ప్రభుత్వంలో మా సొంత పార్టీ నేతలనే ఎందుకు మంత్రులుగా తీసుకున్నారని ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ విజేత నల్లగొండ జట్టు
Health tips | రోజుకో బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

