న్యూఢిల్లీ : ఈకామర్స్ సంస్థ అమెజాన్లో ఇకపై ఎన్సీఈఆర్టీ పుస్తకాలను విక్రయించనున్నారు. కిండర్గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు, అలాగే యూపీఎస్సీ అభ్యర్థుల కోసం అమెజాన్ ఇండియా వెబ్సైట్లో అధీకృత విక్రేతల ద్వారా ఎన్సీఈఆర్టీ పుస్తకాలను విక్రయించనున్నట్టు ఆ సంస్థ సోమవారం వెల్లడించింది. ఎన్సీఈఆర్టీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. వ్యక్తగత కస్టమర్లతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలు, స్కూళ్లకు బల్క్ ఆర్డర్లలో పుస్తకాలను సప్లయ్ చేయనున్నట్టు పేర్కొన్నది.