న్యూఢిల్లీ : కేంద్రం తెచ్చిన జాతీయ వైద్య రిజిస్టర్ (ఎన్ఎంఆర్) నమోదు ఏడాది లోపే విఫలమైంది. ఆధునిక వైద్య ప్రాక్టీషనర్లు తప్పనిసరిగా ఈ కేంద్రీకృత డాటా బేస్ రిజిస్టర్లో నమోదు చేసుకోవాలన్న నిబంధనను కేంద్రం ఇటీవల తొలగించి.. దాన్ని స్వచ్ఛందంగా మార్చింది.
ఈ ఏడాది ఏప్రిల్ వరకు కేవలం ఒక్క శాతం వైద్యులు మాత్రమే ఎన్ఎంఆర్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఎన్ఎంఆర్లో పేర్ల నమోదుకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో ప్రభుత్వం దాన్ని స్వచ్ఛందంగా మారుస్తున్నట్టు ప్రకటించింది.