గ్రహ శకలం దారి మళ్లిద్దాం

- భూమి వైపునకు దూసుకొచ్చే గ్రహశకలాలకు చెక్
- అత్యంత క్లిష్టమైన ‘డార్ట్’ మిషన్‌కు నాసా శ్రీకారం
- 24న ప్రయోగం.. ‘డిమార్ఫస్’ను ఢీకొట్టనున్న రాకెట్
- గ్రహశకలం వేగం, దిశను మార్చడమే మిషన్ లక్ష్యం
నేషనల్ డెస్క్:హాలీవుడ్ సైన్స్‌ఫిక్షన్ సినిమా ‘ఆర్మగెడాన్’ చూశారా? భూమివైపు వేగంగా దూసుకొస్తున్న గ్రహశకలంమీదకు వ్యోమగాములను పంపించి దాని ప్రయాణ దిశను మార్చి మానవాళిని కాపాడటమే ఆ చిత్ర ఇతివృత్తం. సరిగ్గా ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కూడా అదే చేయబోతున్నది. ‘డార్ట్’ పేరిట ఈ నెలలోనే చేపడుతున్న ఈ భారీ మిషన్‌ను.. రోదసి చరిత్రలోనే అత్యంత క్లిష్ట ప్రయోగాల్లో ఒకటిగా చెబుతున్నారు. మరి ఆ మిషన్ విశేషాలేంటంటే..
ఏమిటీ ‘డార్ట్ మిషన్’
భవిష్యత్తులో గ్రహశకలాల నుంచి భూమికి పొంచి ఉన్న ప్రమాదాలను తప్పించడానికి నాసా శాస్త్రవేత్తలు ‘డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) మిషన్’ను రూపొందించారు. ఇందులో భాగంగా భూమికి 1.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘డిడిమోస్’ గ్రహశకల వ్యవస్థలోని ‘డిమార్ఫస్’ అనే గ్రహశకలాన్ని స్పేస్‌క్రాఫ్ట్ సాయంతో ఢీకొట్టనున్నారు. తద్వారా ఆ ఆస్టరాయిడ్ వేగాన్ని తగ్గించి, ప్రయాణ దిశను మార్చనున్నారు. ఈ ప్రయోగంలో ఎలక్ట్రిక్ ప్రపల్షన్ సిస్టమ్, ప్రత్యేక లేజర్ కిరణాలు కీలక పాత్ర పోషించనున్నాయి.
‘డిమార్ఫస్’ గ్రహశకలమే ఎందుకు?
నాసా నిబంధనల ప్రకారం.. భూమికి 4.6 మిలియన్ మైళ్ల చేరువకు వచ్చే 460 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ వెడల్పు గల గ్రహశకలాలన్నీ మానవాళికి ప్రమాదకరమైనవే. అయితే, 2003లో ‘డిమార్ఫస్’ ఆస్టరాయిడ్ (వెడల్పు 524 అడుగులు, బరువు 480 కోట్ల కిలోలు) భూమికి 3.7 మిలియన్ మైళ్ల చేరువకు వచ్చింది. దీంతో గ్రహశకలాల వల్ల భూమికి భవిష్యత్తులో ప్రమాదం ఉందన్న శాస్త్రవేత్తల అంచనాలు తొలిసారిగా నిజమయ్యే సూచనలు కనిపించాయి. ఫలితంగా, భవిష్యత్తులో మరోసారి భూమికి పెను ప్రమాదంగా మారనున్న ‘డిమార్ఫస్’ గ్రహశకలాన్నే ఈ ప్రయోగానికి లక్ష్యంగా వినియోగించుకోవాలని నాసా నిర్ణయించింది.
ప్రయోగం కీలక సమాచారం
మిషన్ పేరు: డార్ట్
ప్రయోగించే సంస్థ: నాసా
స్పేస్ఎక్స్ ఫాల్కన్ ప్రయోగించనున్న తేదీ: నవంబర్ 24, 2021
గ్రహశకలాన్ని ఢీకొట్టే తేదీ: అక్టోబర్ 2, 2022
ఢీకొట్టే సమయంలో రాకెట్ వేగం: గంటకు 15,000 మైళ్లు
ఢీకొట్టే సమయంలో రాకెట్ బరువు: 548 కిలోలు
‘డిమార్ఫస్’ గ్రహశకలం బరువు: 480 కోట్ల కిలోలు
ప్రయోగం ఖర్చు: రూ.2,448 కోట్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- dart mission
- NASA
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

