Loksabha Elections 2024 | విపక్ష ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకరం : మోదీ
Loksabha Elections 2024 : విపక్ష ఇండియా కూటమికి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధులున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Loksabha Elections 2024 : విపక్ష ఇండియా కూటమికి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధులున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని స్రవస్ధిలో బుధవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విపక్ష ఇండియా కూటమికి మతతత్వం, తీవ్ర జాతి వివక్ష, బంధుప్రీతి వంటి వ్యాధులున్నాయని, క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన ఈ వ్యాధులు వ్యాప్తి చెందితే దేశమంతటా వ్యాప్తి చెంది నాశనం చేస్తాయని హెచ్చరించారు.
మోదీ దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇండ్లు ఇచ్చారని, ఇప్పుడు ఎస్పీ-కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నింటినీ తారుమారు చేస్తారని అన్నారు. విపక్షాలు గెలిస్తే పేదలకు తాము నిర్మించిన ఇండ్లను గుంజుకుని వాటిని తమ ఓటు బ్యాంక్‌కు పంచేస్తాయని ఆరోపించారు. తాను ప్రారంభించిన 50 కోట్లకు పైగా జన్‌ధన్ ఖాతాలను మూసివేసి ఆ డబ్బును వారు లాగేసుకుంటారని హెచ్చరించారు. మోదీ ప్రతి గామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తే విపక్షాలు విద్యుత్ కనెక్షన్లను కట్ చేసి మళ్లీ చీకటిలో ముంచుతాయని అన్నారు.
తాను ప్రతి ఇంటికీ నీరందిస్తే ఎస్పీ-కాంగ్రెస్ నేతలు మీ ఇంటి పంపుల నుంచి నీటిని వీరు తీసుకెళ్లే ఘనులని మోదీ ఆరోపించారు. ప్రజల కోసం 60 ఏండ్లుగా ఏమీ చేయని వారు మోదీని నిలువరించేందుకు ఏకమయ్యారని ఎద్దేవా చేశారు. యూపీలో అదే పాత ప్లాఫ్ సినిమాతో అదే పాత క్యారెక్టర్లు, పాత డైలాగ్‌లతో ఇద్దరు వారసత్వ నేతలు బయలుదేరారని వారి ప్రయత్నాలు ఫలించబోవని రాహుల్, అఖిలేష్ యాదవ్‌లను ఉద్దేశించి మోదీ పేర్కొన్నారు.
Read More :
KTR | తెలంగాణలోనూ బుల్డోజర్ రాజ్.. చోటా భాయ్‌పై కేటీఆర్ సెటైర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

