ప్రయాగ్‌రాజ్: మహా కుంభ్‌లో(Mahakumbh Mela) పాల్గొనేందుకు సాధువులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. నాగ సాధువు ప్రమోద్ గిరి మహారాజ్ .. ప్రతి రోజు మట్టికుండ నీటితో స్నానం చేస్తున్నారు. 61 కుండల నీటితో ఆయన స్నానం ఆచరిస్తున్నారు. ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఆయన హఠయోగాలో భాగంగా ఆ పుణ్య స్నానాన్ని చేస్తున్నారు. వాస్తవానికి 41 రోజుల పాటు ఆయన స్నానం చేయాల్సి ఉన్నది. కానీ మహాకుంభ్ సమయాభావం వల్ల ఆ కార్యక్రమాన్ని 21 రోజులకు తగ్గించేశారు.
తొలి రోజు 51 కుండల చలి నీటితో స్నానం చేశాడు. ఒక స్థలంలో కూర్చున్న తర్వాత.. తనపై మిగితా సాధవులు నీటిని పోస్తారని ఆయన తెలిపారు. రోజు రోజుకీ నీటి కుండల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇవాళ 61 కుండల నీటితో స్నానం చేశానని, 21 రోజులు పూర్తి అయితే, అప్పుడు 108 కుండల నీటితో స్నానం చేయనున్నట్లు చెప్పారు.
#WATCH | Mahakumbh 2025 | Prayagraj, Uttar Pradesh: Naga Sadhu Pramod Giri Maharaj performs ‘Hatha Yoga’ in the Mahakumbh Mela by bathing with 61 pots of water. He performs this remarkable ritual every morning at 4:00 AM. pic.twitter.com/AWIPwthx9O
— ANI (@ANI) January 7, 2025
మానవ సమాజ సంక్షేమం కోసం చలిస్నానం చేస్తున్నట్లు తెలిపారు. దీంట్లో ఎటువంటి స్వార్థం లేదన్నారు. సనాతన ధర్మ స్థాపన కోసం తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఈ హఠయోగాను చేయడం ఇది తొమ్మిదో ఏడాది అన్నారు. గురు మహారాజ్ ఆశీస్సులు ఉన్నన్ని రోజులు పుణ్య స్నానం ఆచరిస్తామన్నారు.
ఈనెల 14వ తేదీన నాగసాధువులు తొలి పవిత్ర సాహి స్నానాలు చేస్తారన్నారు. ఆ రోజున స్నానం చేయడం పెద్ద చాలెంజింగ్ ఉంటుందని, మొదట అకాడా వద్ద చేసి, ఆ తర్వాత నదీలో సాహి స్నానం చేయాల్సి ఉంటుందన్నారు.