Naga protest turns violent | మణిపూర్‌లో హింసాత్మకంగా మారిన నాగాల నిరసన.. బాష్పవాయువు ప్రయోగం, నలుగురికి గాయాలు
Naga protest turns violent | మణిపూర్‌లో నాగాల నిరసన హింసాత్మకంగా మారింది. భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇంఫాల్: మణిపూర్‌లో నాగాల నిరసన హింసాత్మకంగా మారింది. భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Naga protest turns violent) మే 13న కాంగ్పోక్పి జిల్లా నుంచి కిడ్నాపైన ఆరుగురు నాగా పౌరులు నెల తర్వాత హత్యకు గురయ్యారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యల కోసం డిమాండ్ చేస్తూ యునైటెడ్ నాగ కౌన్సిల్ (యూఎన్సీ) ఆధ్వర్యంలో గురువారం కాంగ్లాటొంగ్బిలో శాంతియుతంగా చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. గుంపును చెదరగొట్టేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించారు.
కాగా, ఈ సంఘటనలో నలుగురు నిరసనకారులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఇంఫాల్‌లోని ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాంగ్లాటోంగ్బి, దాని పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించారు.
మరోవైపు శాంతియుతంగా నిరసన చేస్తున్న నాగా నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించడంపై నాగ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్), లియాంగ్మై నాగా కౌన్సిల్ (ఎల్ఎన్సీ-ఎం) ఖండించాయి. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరుపాలని, గాయపడిన వారికి తగిన వైద్య సహాయం అందించాలని, అదుపులోకి తీసుకున్న గ్రామస్థులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. యూఎన్సీ చార్టర్ కింద ఉన్న అన్ని డిమాండ్లు నెరవేరే వరకు తమ ప్రజాస్వామ్య ఆందోళన కొనసాగిస్తామని నాగా కౌన్సిల్ పునరుద్ఘాటించింది.
Excessive use of force by security forces (mainly state forces as seen in video footage) leaves many peaceful protestors seriously injured at Kanglatongbi. 4 seriously injured are admitted at JNIMS Imphal. Indigenous Communities of Manipur demands for justice of 6 naga brothers… pic.twitter.com/Bg2aoOkNzt
— Paul Chawang (@paul_chawang) August 20, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

