Bulli Bai app | గత సంవత్సరం సుల్లి డీల్స్ పేరుతో ఓ యాప్ వందల మంది ముస్లిం మహిళల ఫోటోలను వేలంలో పెట్టిన విషయం మీకు గుర్తుందా? సుల్లి అనే అభ్యంతరకరమైన పేరుతో యాప్ కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు ముస్లిం మహిళల హక్కులకు భంగం కలిగించడంతో వెంటనే ఆ యాప్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ యాప్‌ను పోలిన మరో యాప్ ముస్లిం మహిళల ఫోటోలను వేలంలో పెట్టింది.
It is very sad that as a Muslim woman you have to start your new year with this sense of fear & disgust. Of course it goes without saying that I am not the only one being targeted in this new version of #sullideals. Screenshot sent by a friend this morning.
— Ismat Ara (@IsmatAraa) January 1, 2022
Happy new year. pic.twitter.com/pHuzuRrNXR
కొత్త సంవత్సరం వేళ ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బుల్లి బాయ్ పేరుతో ఈ యాప్ మళ్లీ ముస్లిం మహిళల ఫోటోలతో విరుచుకుపడింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు. ముంబైలో కూడా శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ఫిర్యాదుతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
కావాలని ఒక వర్గం ప్రజలను టార్గెట్ చేసుకొని ఈ యాప్స్ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సుల్లి డీల్స్ యాప్‌పై ఇప్పటికే చర్యలు తీసుకున్నా.. తిరిగి బుల్లి బాయ్ పేరుతో మళ్లీ యాప్‌ను సాఫ్ట్వేర్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ గిట్‌హబ్ నుంచి తొలగించినట్టు పోలీసులు తెలిపారు.
Have spoken to @CPMumbaiPolice and DCP Crime Rashmi Karandikar ji. They will investigate this. Have also spoken to @DGPMaharashtra for intervention. Hoping those behind such misogynistic and sexist sites are apprehended. https://t.co/Ofo1l9dgIl
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 1, 2022
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ముస్లిం మహిళలు సింగిల్‌గా ఉన్న ఫోటోలను తీసుకొని వాటిని యాప్స్‌లో అమ్మకానికి వేలం పెట్టడమే బుల్లి బాయ్ యాప్ టార్గెట్. అయితే.. ఇదంతా రియల్ సేల్ కాకపోయినప్పటికీ.. మహిళల ఫోటోలను పబ్లిక్‌లో పెట్టి వేలం వేయడం అనేది చట్టరిత్యానేరం. అందుకే.. మరోసారి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.
The matter has been taken cognizance of. Concerned officials have been directed to take appropriate action.
— Delhi Police (@DelhiPolice) January 1, 2022