ముంబై: ట్రాఫిక్‌కు సంబంధించిన సందేశాలు చూపే ఎల్ఈడీ సైన్ బోర్డులో ‘ప్రతి రోజూ గంజాయి పీల్చండి’ అని కనిపించింది. ఇది చూసి వాహనదారులు షాక్ అయ్యారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. సోమవారం రాత్రి వర్లీ నాకా జంక్షన్‌కు సమీపంలో ఉన్న ట్రాఫిక్ ఎల్ఈడీ బోర్డులో ‘ప్రతి రోజూ గంజాయి స్మోక్ చేయండి’ అని డిస్ప్లే అయ్యింది. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు ఇది చూసి షాకయ్యారు.
కాగా, సాంకేతిక సమస్య వల్ల ఆ మెసేజ్ డిస్ప్లే అయ్యిందని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ప్రవీణ్ పడ్వాల్ తెలిపారు. ఆ ఎల్ఈడీ సైన్ బోర్డును ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహిస్తున్నదని చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ డిస్ప్లే బోర్డును ఆపేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఒక వాహనంపై ఉన్న సీసీటీవీలో రికార్డు అయిన ఈ వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. పలువురు నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్లు చేశారు.
Haji Ali, Mumbai – diversion sign now says "smoke weed everyday" pic.twitter.com/ivdTItelUY
— Akshat Deora (@tigerAkD) December 20, 2022