Sundar Pichai | గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో ఐదు కంపెనీలపై కాపీరైట్ చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.
కోర్టు ఆదేశాల మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మరో ఐదు కంపెనీల అఫిషియల్స్‌పై Copyright Act violation కింద కేసు రిజిస్టర్ చేశామని ముంబై పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ దర్శకుడు సునీల్ దర్శన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. సునీల్ దర్శకత్వం వహించిన Ek Haseena Thi Ek Deewana Tha అనే సినిమాను యూట్యూబ్‌లో అనధికారికంగా అప్లోడ్ చేయడాన్ని గూగుల్ అనుమతించిందని ఆరోపించాడు. దీంతో గూగుల్ కంపెనీ సీఈవోపై సునీల్ ముంబైలో ఫిర్యాదు చేయగా.. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.