ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ నెల 28న తలపెట్టిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ), ముంబై పోలీసులు, ఇతరులకు వ్యతిరేకంగా ముంబై కాంగ్రెస్ విభాగం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మంగళవారం విచారణ జరుగనున్నది.
కాగా, రాహుల్ గాంధీ ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదో అర్థం కావడం లేదని ముంబై కాంగ్రెస్ చీఫ్ భాయ్ జగ్తాప్ అన్నారు. అధికారులు కరోనా గురించి ఆందోళన చెందుతుంటే, కోవిడ్ మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని మా లేఖలో ఇప్పటికే వారికి చెప్పామన్నారు. ర్యాలీకి ఎక్కువ సమయం లేనందున అనుమతి కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీతోపాటు కాంగ్రెస్ కూడా భాగంగా ఉన్నది.