సామాన్లను పక్క సీట్లలో పెట్టుకున్నారు? వేరే వారికి సీటొద్దా అనుకుంటున్నారా? అవి అలాంటి ఇలాంటి సామాన్లు కాదు.. దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పీఠంపై కూర్చోబోయే వారి భవితవ్యాన్ని తేల్చనున్న బ్యాలట్ పెట్టెలు. వాటిని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఒక్కో బ్యాలట్ బాక్సుకు ఒక్కో టికెట్ బుక్ చేసి ఇలా భద్రంగా తీసుకెళ్తున్నారు. ఈ ఫొటోను ఈసీ మంగళవారం పోస్ట్ చేసింది.