పిక్చర్ అభీ బాకీ హై..!
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో అంతర్గత విభేదాలు ముదిరాయి. సొంత పార్టీ నేతలు తనపై విమర్శలపై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. పంజాబ్ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించటం లేదన్న ఆరోపణలను తిప్పికొడుతూ, తాను రాష్ట్రం కోసం పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.
- ఆప్ నేతలకు రాఘవ్ చద్దా కౌంటర్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో అంతర్గత విభేదాలు ముదిరాయి. సొంత పార్టీ నేతలు తనపై విమర్శలపై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. పంజాబ్ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించటం లేదన్న ఆరోపణలను తిప్పికొడుతూ, తాను రాష్ట్రం కోసం పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ‘ఎక్స్’లో ఓ వీడియో క్లిప్‌ను పంచుకున్నారు. రాజ్యసభలో ఆయన పంజాబ్ సమస్యలపై మాట్లాడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ‘రాఘవ్ చద్దా పంజాబ్ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించటంలో విఫలమయ్యారని అంటున్న నా సహచరులకు ఇదే నా సమాధానం. ఇది ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. పిక్చర్ అభీ బాకీ హై’ అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించిన తర్వాత ఈ వివాదం మొదలైంది. సొంతపార్టీ నేతలు ఆయనపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై రాఘవ్ చద్దా స్పందిస్తూ, ‘నాపై ఒకే రకమైన ప్రశ్నలు, ఒకే రకమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు.. పరస్పర సహకారంతో చేస్తున్నారు ఇదంతా. నేను మౌనంగా ఉంటే, పదే పదే చెప్పే అబద్ధం.. నిజంలా అనిపిస్తుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

