న్యూఢిల్లీ: భోజ్‌పూరి నటుడు, ఎంపీ మనోజ్ తివారీ తన భార్య సురభి తివారీకి గ్రాండ్‌గా సీమంతం నిర్వహించారు. ఆ వేడుకకు చెందిన వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 51 ఏళ్ల మనోజ్ తివారీకి సురభి రెండవ భార్య. ఆమె 2020లో ఓ కూతురుకు జన్మనిచ్చింది. ఇప్పుడు మళ్లీ గర్భం దాల్చింది. గోద్ భరాయి వేడుకకు చెందిన వీడియోను ఎంపీ తివారీ షేర్ చేశారు. కొన్ని సంతోషాలను మాటల్లో చెప్పలేమని, వాటిని అనుభవించాల్సిందే అని తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
కలర్ఫుల్గా జరిగిన ఆ సెర్మనీలో మనోజ్, సురభి తివారీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక కాబోయే తల్లికి కంగ్రాట్స్ మెసేజ్‌లో కూడా వెల్లువెత్తాయి. ఎంపీ మనోజ్ తివారీ 1999లో రాణి తివారీని పెళ్లి చేసుకున్నారు. ఆ జంటకు ఓ కుమార్తె ఉంది. 2012లో రాణికి విడాకులు ఇచ్చారు.