ముంబై: మారన్ సోదరుల మధ్య వివాదం.. సన్ టీవీ(Sun TV) షేర్ల పతనానికి కారణమైంది. ఇవాళ ఆ ఛానల్ షేర్లు 4 శాతం డౌన్ అయ్యాయి. డీఎంకే ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్.. తన సోదరుడు కళానిధి మారన్‌కు లీగల్ నోటీసులు పంపారు. సన్ టీవీ నెట్వర్క్ చైర్మెన్‌గా కళానిధి మారన్ వ్యవహరిస్తున్నారు. 2003లో జరిగిన షేర్ల లావాదేవీలపై అంశంపై కళానిధి మారన్‌తో పాటు ఆయన భార్య కావేరి కళానిధికి దయానిధి మారన్ లీగల్ నోటీసులు ఇచ్చారు. సన్ టీవీ టేకోవర్ సమయంలో తప్పుడు విధానాలు, తప్పుడు పాలనతో అక్రమాలకు పాల్పడినట్లు కళానిధి మారన్‌పై దయానిధి మారన్ విమర్శలు చేశారు.
కోఆర్డినేటెడ్ పత్థిలో ఆర్థిక నేరాలకు తన సోదరుడు పాల్పడినట్లు దయానిధి మారన్ తన అఫిడవిట్లో తెలిపాడు. చీటింగ్, మనీ ల్యాండరింగ్‌కు కూడా పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు ఆ కేసులో దర్యాప్తు చేపట్టనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. తండ్రి మురసోలీ మారన్ 2003లో మృతిచెందారు. అయితే ఆ తర్వాత జరిగిన సన్ టీవీ షేర్లు అప్పగింతలో వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది.
వీలునామా రాయకుండానే తండ్రి చనిపోయారని, అందుకే 2003 నాటి ప్రకారం షేర్ల పంపకం జరగాలన్నారు. సెబీ, ఆర్బీఐ, ఎస్ఎఫ్ఐఓ, ఈడీ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలు ఈ విచారణలో పాల్గొనాలని కళానిధికి నోటీసులో తెలిపారు. కంపెనీలో కళానిధి మారన్‌కు 75 శాతం వాటా ఉన్నది. అది మార్కెట్ విలువ 25 వేల కోట్లు. సన్ టీవీ నెట్వర్క్ లో తమిళం, తెలుగు, హిందీ, బెంగాలీ భాషలు ఉన్నాయి. ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఉన్నాయి. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉంది.