కరోనా ఎఫెక్ట్: తోపుడు బండిపై తల్లి అంతిమ యాత్ర..!
Last Journey on cot: రాజస్థాన్‌లో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. మాతృదినోత్సవం నాడే ఓ తల్లికి అవమానకర రీతిలో అంతిమ యాత్ర

జైపూర్: రాజస్థాన్‌లో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. మాతృదినోత్సవం నాడే ఓ తల్లికి అవమానకర రీతిలో అంతిమ యాత్ర నిర్వహించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని ఝహల్వార్ పట్టణంలో ఇటీవల ఓ మహిళ కరోనా వైరస్ సోకి మృతిచెందింది. అయతే, ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అధికారులు నిరాకరించారు. కనీసం మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ అయినా సమకూర్చాలని వేడుకున్నా పట్టించుకోలేదు.
మరోవైపు గ్రామస్తులు కూడా ఆ కుటుంబానికి సహకరించలేదు. దాంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మృతురాలి ఇద్దరు కొడుకులు ఓ తోపుడు బండిపై తల్లి శవాన్ని పెట్టుకుని శ్మశానానికి తీసుకెళ్లారు. దాదాపు ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానానికి తోపుడు బండిపైనే తల్లి మృతదేహాన్ని తరలించారు. ఆ తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి సరిపోయిందని, లేదంటే పరిస్థితి ఏమిటని ఈ విషయం తెలిసిన మానవతావాదులు ప్రశ్న లేవనెత్తుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కరోనా పాజిటివ్‌గా తేలిన గంటల్లోనే యువ డాక్టర్ మృతి..!
నీరవ్ మోదీ అప్పగింత మరింత ఆలస్యం..!
నేపాల్‌లో 26 మంది ఎంపీలకు కరోనా..!
మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

