Mosquitoes | వర్జీనియా, డిసెంబర్ 24: వాతావరణ మార్పుల వల్ల వాతావరణం వేడెక్కినపుడు దోమలు వృద్ధి చెందుతాయని వర్జీనియా కామన్వెల్త్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. దోమల లార్వాను తినే తూనీగలు వేడి వాతావరణంలో సమర్థతను చూపలేవని తెలిపింది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు దోమల లార్వా వేగంగా వృద్ధి చెంది, దోమలుగా మారుతాయని తెలిపింది.
అంటే సాధారణ ఉష్ణోగ్రత గల వాతావరణంలో కన్నా వేడి వాతావరణంలో రెట్టింపు దోమలు తయారవుతాయన్నమాట! తూనీగలు ఎదురుగా ఉన్నప్పటికీ, లార్వా నుంచి దోమలు పెరిగి, పెద్దవి అవుతూనే ఉంటాయని తెలిపింది.