Kashmir Tourists: జమ్మూకశ్మీర్‌కు పోటెత్తిన పర్యాటకులు.. ఈ ఏడాది 1.62 కోట్ల మంది విజిట్
kashmir tourists:జమ్మూకశ్మీర్‌కు పర్యాటకులు(kashmir tourists) పోటెత్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని 1.62 కోట్ల మంది టూరిస్టులు విజిట్ చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగంగా జరుగుతోందన
జమ్మూ: జమ్మూకశ్మీర్‌కు పర్యాటకులు(kashmir tourists) పోటెత్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని 1.62 కోట్ల మంది టూరిస్టులు విజిట్ చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగంగా జరుగుతోందనడానికి ఇదే నిదర్శనమి ఆ అధికారి తెలిపారు. మూడు దశాబ్ధాల తర్వాత మళ్లీ అధిక స్థాయిలో లక్షలాది మంది టూరిస్టులు కశ్మీర్‌కు వస్తున్నట్లు ఆయన చెప్పారు. కశ్మీర్ టూరిజంలో మళ్లీ స్వర్ణయుగం మొదలైనట్లు కొందరంటున్నారు.
జమ్మూకశ్మీర్‌లో టూరిజమే అతిపెద్ద ఉపాధి. 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు 1.62 కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్‌ను విజిట్ చేసినట్లు అధికారులు తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత్‌లో.. అత్యధిక స్థాయిలో పర్యాటకులు రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈ ఏడాది తొలి 8 నెలల్లోనే రికార్డు స్థాయిలో 20.5 లక్షల దేశీయ టూరిస్టులు వచ్చినట్లు తెలిపారు. దాంట్లో 3.65 లక్షల మంది అమర్నాథ్ యాత్రికులు ఉన్నట్లు చెప్పారు.
పహల్గామ్, గుల్మార్గ్, సోనామార్గ్ లాంటి టూరిస్టు ప్రాంతాల్లో హోటళ్లు, గెస్ట్‌హౌజ్‌లు నూటికి నూరు శాతం నిండిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. టూరిజం వల్ల పూంచ్, రాజౌరి, జమ్మూ, కశ్మీర్ లోయలో భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెబుతున్నారు. సమగ్రమైన ఫిల్మ్ పాలసీని కూడా రూపొందించారు. ఈ సారి 140 షూటింగ్‌లకు పర్మిషన్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

