బరేలీ, జూలై 17: కోతులను రెచ్చగొడితే.. అవి అరుస్తూ మనపైకి దూకేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఒక కోతి ఏకంగా ఓ నాలుగు నెలల వయసుండే పసిబిడ్డను బిల్డింగ్ పైనుంచి కిందకు పడేసి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన యూపీలోని బరేలీ పట్టణ శివారు ప్రాంతంలో చోటుచేసుకున్నది. ఈ ఘటనలో ఆ బాబు అక్కడికక్కడే మరణించాడు. బరేలీ శివారులోని దుంకా గ్రామానికి చెందిన నిద్రేష్ ఉపాధ్యాయ, ఆయన భార్య శుక్రవారం సాయంత్రం తమ నాలుగేండ్ల బాబును ఎత్తుకొని భవన పైఅంతస్తుపై వాకింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ కోతుల గుంపు బిల్డింగ్‌పైకి వచ్చింది. తరమించేందుకు ప్రయత్నించగా, అవి వారిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో కిందకు వెళ్లేందుకు మెట్ల వైపునకు వెళ్లుండగా.. చేతుల్లో ఉన్న బిడ్డకు కింద పడ్డాడు. దీంతో ఆ గుంపులోని ఓ కోతి వెంటనే ఆ బిడ్డను అమాంతం పట్టుకొని భవనంపై నుంచి కిందకు పడేసింది.