తిరువనంతపురం: కేరళలో మరో ఎంపాక్స్ కేసు వెలుగులోకి వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు చికిత్స చేయించుకోవాలని కోరింది. శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించినట్లు వివరించింది.
ఎంపాక్స్ వ్యాధిగ్రస్థునితో కలసిన వారి జాబితాను తయారు చేశామని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. విదేశాల నుంచి రాష్ర్టానికి వచ్చినవారు ఎంపాక్స్ లక్షణాలు కనిపిస్తే, ఆరోగ్య శాఖను సంప్రదించాలని కోరారు. అన్ని జిల్లాల్లోనూ ఐసొలేషన్ సదుపాయాలను కల్పించామన్నారు. దేశంలోనే మొదటి ఎంపాక్స్ కేసు కేరళలోనే ఇటీవల నమోదైంది.