Subhadra Yojna : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీ మహిళలు, రైతులకు తీపికబురు అందించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భువనేశ్వర్‌లో గురువారం జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం మాఝీ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర సమరయోధుల నిస్వార్ధ పోరాటం, సేవల ఫలితంగానే మనకు 1947, ఆగస్ట్ 15న స్వాతంత్య్రం లభించిందని చెప్పారు.
ఆపై స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు. స్వతంత్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించడంతో పాటు సమున్నత త్యాగ ఫలితమే ఇవాళ మనం వాటి తాలూకూ ఫలాలను అనుభవిస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించకుని సుభద్ర యోజనను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.
ఈ పధకం కింద మహిళలందరికీ రూ. 50,000 అందచేస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న ఈ పధకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఇక ఒడిషా రైతులకు వరి పంటకు దేశంలోనే అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 3100 చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. రైతులు, మహిళల మేలు కోసం స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తీపికబురు అందిస్తున్నామని సీఎం మోహన్ చరణ్ మాఝీ తెలిపారు.
Read More :
Double iSmart | డబుల్ ఇస్మార్ట్ మూవీ రివ్యూ: రామ్-పూరి మాస్ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా ?