మోఘా: పంజాబ్‌లోని మోఘాకు చెందిన కార్మికుడికి సుమారు 35 కోట్ల జీఎస్టీ(GST) బిల్లు వచ్చింది. దీంతో షాకైన ఆ వ్యక్తి సదురు శాఖను కలిశాడు. మోఘాలోని బోహ్నా చౌక్‌కు చెందిన అజ్మీర్ సింగ్ అనే రోజువారి కార్మికుడికి 35 కోట్ల జీఎస్టీ బిల్లు వచ్చింది. తిండి కోసం తిప్పులు పడే తనకు ఎలా ఆ బిల్లు వచ్చిందా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడతను.
గతంలోనూ ఓ సారి అజ్మీర్ సింగ్‌కు భారీగానే జీఎస్టీ బిల్లు వచ్చింది. 2022లో అతనికి 21 లక్షల జీఎస్టీ నోటీసు జారీ చేశారు. అప్పుడు కూడా ఆయన జీఎస్టీ ఆఫీసుకెళ్లాడు. విచారణ చేయమని కోరాడు. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు రెండేళ్లే తర్వాత 35 కోట్ల జీఎస్టీ బిల్లు రావడం గమనార్హం.
భారీ మొత్తంలో జీఎస్టీ నోటీసు రావడంతో అజ్మీర్ సింగ్.. లుథియానాలోని జీఎస్టీ ఆఫీసుకెళ్లాడు. సీ కే ఇంటర్నేషనల్ కంపెనీ పేరుతో ఆ బిల్లు జారీ అయ్యింది. అయితే అజ్మీర్ సింగ్ ఆధార్ కార్డు, ప్యాన్ డిటేల్స్‌తో ఆ కంపెనీ రిజిస్టర్ అయినట్లు తెలుస్తున్నది. లుథియానాలోని గిల్ రోడ్డులో కంపెనీ ఉన్నట్లు పేర్కొన్నారు. బహుశా తన ఆధార్ కార్డును కోవిడ్ సమయంలో సేకరించి ఉంటారని అజ్మీర్ సింగ్ ఆరోపించాడు. తనకు ప్యాన్ కార్డు లేదని, అసలు దాని గురించి దరఖాస్తు కూడా చేయలేదన్నాడు.
పోలీసు ఫిర్యాదు నమోదు చేయాలని అజ్మీర్‌కు జీఎస్టీ శాఖ సూచించింది. ఆ సూచనమేరకు మోఘా సిటీలోని సౌత్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడతను. జీఎస్టీ బిల్లుపై విచారణ చేపట్టాలని అజ్మీర్ సింగ్ డిమాండ్ చేశాడు.