Mamatha banerjee : మోదీకి ప్రత్యామ్నాయం మమతయే.. రాహుల్ కాదు
Mamatha banerjee : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాహుల్‌గాంధీ ఎంతమాత్రమూ ప్రత్యామ్నాయం కాదు. మమతా బెనర్జీ ఒక్కరితోనే అది సాధ్యమవుతుంది. కాంగ్రెస్‌తో విపక్షాల ఐక్యత గురించి ...

న్యూఢిల్లీ: ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాహుల్‌గాంధీ ఎంతమాత్రమూ ప్రత్యామ్నాయం కాదు. మమతా బెనర్జీ (Mamatha banerjee) ఒక్కరితోనే అది సాధ్యమవుతుంది. కాంగ్రెస్‌తో విపక్షాల ఐక్యత గురించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడారు. భవిష్యత్‌లో విపక్షాలను మరింత ముందుకు తీసుకెళ్తారు. ఢిల్లీ వాదన విషయంలో రాజీపడేది లేదని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేస్తున్నది. మోదీని ఢీకొనడం రాహుల్‌గాంధీతో కాదు. అది కేవలం మమతా బెనర్జీకే సాధ్యం’… ఈ విషయాలను తృణమూల్ కాంగ్రెస్ మౌత్‌పీస్ ‘జాగో బంగ్లా’ పత్రికలో శుక్రవారం ‘రాహుల్ గాంధీ వైఫల్యం, మమత ఒక ఎంపిక’ శీర్షికతో ప్రచురితమైన వ్యాసంలో పేర్కొన్నారు. ఈ వ్యాసాన్ని లోక్‌సభ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ రాశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్లిన మమత.. అక్కడ సోనియాతోపాటు ఇతర నేతలను కలిసి ఐక్య ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతపై చర్చించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు పూర్తయి తమ ప్రభుత్వం ఏర్పాటైనందున.. ఇక ఢిల్లీపై దృష్టిపెడతానని నిర్మొహమాటంగా చెప్పారు. విపక్షాల మెదడులో తానే ప్రత్యామ్నాయం అనే విషయాన్ని ఇంజెక్ట్ చేసేందుకు తన పార్టీ పత్రికలో వ్యాసాలు రాయిస్తున్నట్లుగా తెలుస్తున్నది. రాహుల్ గాంధీ తనకు చాలా కాలంగా తెలుసునని, కానీ మోదీకి ప్రత్యామ్నాయంగా ముద్ర వేయడంలో రాహుల్ ఘోరంగా విఫలమయ్యారని చెప్పగలనని రాశారు. మమతా బెనర్జీ మాత్రం ఈ విషయంలో గొప్ప విజయం సాధించారని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడటం తొందరే..
తృణమూల్ వాదనపై రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేచినట్లయింది. ఇటువంటి ప్రకటనలకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, మోదీకి ప్రత్యామ్నాయం ఎవరో చెప్పడానికి ఇంత తొందరెందుకు అని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పేర్కొన్నది. ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు విజయం సాధించలేదనే దానిపై చర్చకు రావాలని తాము కోరుకోవడం లేదని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. లోక్‌సభ ఎన్నికలు జరగడానికి మరో మూడేండ్ల సమయం ఉన్నదని గుర్తుచేశారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వంపై అత్యంత అనుకూలమైన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందారని అధిర్ రంజన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఆ దాడి నిజంగా తప్పిదమే.. క్షమాపణలు చెప్పిన యూఎస్ ఆర్మీ
మళ్లీ ఏకమవుతున్న బీజేపీ-శివసేన!
మర్చిపోలేని ఉరి ఘటనకు ఐదేండ్లు
డబ్బానిండా 5 సెంట్ల కాయిన్లు.. ఎందుకిచ్చాడంటే?
14 ఏండ్ల క్రితం కిడ్నాప్.. ఫేస్బుక్ మెసేజ్‌తో కలిసిన తల్లీకూతురు
దగ్గితే చాలు.. వ్యాధేంటో ఈ యాప్ చెప్తుంది!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

