న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ర్టాలైన గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ జమ్ము కశ్మీరులో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ జరగనున్నది. ఇటీవల నాలుగు రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణల కాలంలో ఈ నాలుగు సరిహద్దు రాష్ర్టాలపైనే పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు జరిగాయి.
మాక్ డ్రిల్ సందర్భంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆదేశించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కంట్రోల్ రూముల నిర్వహణ, వైమానిక దాడుల హెచ్చరిక వ్యవస్థల పనితీరును మాక్ డ్రిల్ సందర్భంగా పరీక్షించనున్నట్లు వారు చెప్పారు. గురువారం(మే 29) మాక్ డ్రిల్స్ నిర్వహించున్నట్లు రాజస్థాన్లోని బార్మర్ జిల్లా కలెక్టర్ టీనా దాబీ తెలిపారు.