లక్నో : 13 సంవత్సరాల బాలుడు గేమ్స్ ఆడుతుండగా ఒక్కసారిగా మొబైల్ పేలిపోయింది. ఘటనలో
బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స
పొందుతున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మథుర మేవతి మొహల్లా ప్రాంతంలో చోటు చేసుకున్నది.
వివరాల్లోకి వెళితే.. మేవతి మొహల్లా ప్రాంతంలో నివాసం ఉంటున్న జావేద్ అనే వ్యక్తి కొడుకు జునైద్ (13) గదిలో ఒక్కడే మొబైల్ ఆడుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఒక్కసారిగా మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అయ్యింది. గదిలో నుంచి భారీ శబ్దం రావడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూడగా.. బాలుడు తీవ్ర గాయాలతో కనిపించాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం తప్పిందని, ఛాతిభాగంలో గాయాలయ్యాయని, వెంట్రుకలు కాలిపోయాయి. గేమ్స్ ఆడుతుండగానే మొబైల్ పేలిందని, ఒక్కసారిగా బ్లాస్ట్ జరగడంతో జునైద్ తీవ్రంగా భయపడ్డాడని తెలిపాడు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, జునైద్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారని జావేద్ పేర్కొన్నాడు.