ఐజ్వాల్: మిజోరం ముఖ్యమంత్రి కుమార్తె ఒక డాక్టర్‌ను కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మిజోరం సీఎం జోరంతంగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆయన కూతురు మిలారీ చాంగ్టే, ఐజ్వాల్‌లోని చర్మవాధుల క్లినిక్‌కు బుధవారం వెళ్లింది. అయితే అపాయింట్మెంట్ లేనిదే తాను వైద్యం చేయనని డాక్టర్ చెప్పాడు. అపాయింట్మెంట్ తీసుకోవాలని ఆయన సూచించాడు. దీంతో ఆగ్రహించిన మిలారీ ఆ వైద్యుడి చెంప, ముఖంపై కొట్టింది. ఆమెను వెనక్కి లాగి, సముదాయించేందుకు అక్కడ ఉన్న వారు చాలా ప్రయత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మిజోరం యూనిట్ ఈ సంఘటనను ఖండించింది. సీఎం కుమార్తె డాక్టర్‌ను కొట్టడంపై వైద్యులు నిరసన తెలిపారు. శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మిజోరం సీఎం జోరంతంగా చివరకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఐజ్వాల్‌కు చెందిన చర్మవ్యాధి నిపుణుడితో తన కుమార్తె ‘తప్పుగా ప్రవర్తించినందుకు’ క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఆమె ప్రవర్తనను తాను ఏ విధంగానూ సమర్థించబోనని తెలిపారు. ఈ మేరకు చేతితో రాసిన లేఖను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేశారు.
Video: Mizoram Chief Minister's @ZoramthangaCM Daughter Hits Doctor, Father Says Sorry @SupriyaShrinate @Ashok_Kashmir pic.twitter.com/5f0EJ2RshZ
— Danish Chaudhary (@LaBelleDame7) August 21, 2022