Imran Khan | భారత్లోని మైనారిటీలను మెజారిటీ వర్గం టార్గెట్ చేస్తోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇలాంటి పరిణామాలు ఎంత మాత్రము మంచిది కాదని, ఎంతో ముప్పు అని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్ వేదికగా డిసెంబర్లో జరిగిన సాధు సంతుల సమ్మేళనాల్లో ముస్లింల విషయంలో చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకునే ఇమ్రాన్ ట్వీట్ చేశారు. భారత్లో 20 కోట్లకు పైగా ముస్లింలున్నారని, వారి మారణ హోమానికి బీజేపీ ప్రభుత్వం మద్దతిస్తుందా? అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో అంతర్జాతీ సమాజం దృష్టి నిలపాలని, తగు చర్యలకు ఉపక్రమించాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. డిసెంబర్ మాసంలో హరిద్వార్ వేదికగా అనేక మంది సాధు సంతుల ఆధ్వర్యంలో ఓ ధర్మ సమ్మేళనం జరిగింది. ఇందులో పాల్గొన్న వారు ముస్లిం వర్గీయులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.