ముంబై: నవీ ముంబైలో పోలీసులు 13 ఏళ్ల కుర్రాడిని అరెస్టు చేశారు. ఐపీసీ, పోక్సో చట్టాల కింద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 15 ఏళ్ల సోదరి(Minor siblings) గర్భం దాల్చడానికి కారణమైన 13 ఏళ్ల పిల్లోడిని అరెస్టు చేశారు. తాను ప్రెగ్నెంట్ కావడానికి సోదరుడే కారణమని ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది. అయితే ఆ ఇద్దరూ కలిసి పోర్న్ చూడడం వల్లే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. వాషి జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. డిసెంబర్ 2023లో అక్కాతమ్ముళ్లు ఇద్దరూ తొలిసారి సెక్స్‌లో పాల్గొనేందుకు ప్రయత్నించారని, కానీ ఆ ప్రయత్నంలో వాళ్లు విఫలమైనట్లు ఈ కేసును విచారిస్తున్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఆ అమ్మాయిని తన సోదరుడు రేప్ చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలు తన నెలసరి తప్పడంతో ఈ విషయాన్ని తల్లికి చేరవేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఖండేశ్వర్ పోలీసు స్టేషన్‌కు కేసును ట్రాన్స్ఫర్ చేశారు. మైనర్ బాలుడి విషయంలో ఏం చేయాలన్న అంశాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమీషన్ చూసుకుంటుందన్నారు. ఐపీసీలోని 376, 376(2) సెక్షన్ల కింద పిల్లోడిపై కేసు బుక్ చేశారు. పోక్సో చట్టంలోని 4,6,8,12 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు.