యూపీ మంత్రి గిరీశ్చంద్ర యాదవ్కు వింత అనుభవం ఎదురైంది. యూపీలోని బాందాలో రెండు రోజుల పాటు ఆయన పర్యటిస్తున్నారు. తన పర్యటన పూర్తి చేసుకొని, ఆయన ఓ విశ్రాంతి భవనంలో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో ఓ ఎలుక ఆయన్ను కొరికింది. దీంతో ఆయన నిద్రలో ఉలిక్కిపడి లేచారు. పాము కాటేసిందనుకొని, తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయన్ను స్థానికంగా వుండే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత పాము కాటు కాదని, ఎలుక కొరికిందని స్పష్టం చేశారు. దీంతో మంత్రి ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ఆయన కాలికి పట్టీ కట్టి, డిశ్చార్జీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రిక వైద్యం చేసిన డాక్టర్ మాట్లాడుతూ.. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి ఇక్కడి వచ్చారని, ఈ సందర్భంగా బస చేసిన ప్రాంతంలో ఆయన్ను ఎలుక కొరికిందని పేర్కొన్నారు. కానీ… నిద్ర మత్తులో పాము కాటేసిందని ఆయన హైరానా పడ్డారని, అటవీ ప్రాంతం కావడంతో మంత్రి మరింత భయపడ్డారని అన్నారు. కానీ.. చివరికి.. ఎలుక కాటేసిందని తాము నిర్ధారించామని వైద్యులు తెలిపారు.