న్యూఢిల్లీ: క్రౌడ్స్ట్రయిక్లో మాల్వేర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్(Microsoft) సేవలు స్తంభించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆ సంస్థ రికవరీ టూల్‌ను రిలీజ్ చేసింది. విన్పీఈ టూల్‌ను రిలీజ్ చేసినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. క్రౌడ్‌స్ట్రయిక్ మాల్వేర్ వల్ల ప్రభావానికి లోనైన యూజర్లు.. కొత్తగా రిలీజ్ చేసిన విన్పీఈ టూల్‌ను వాడవచ్చు అని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. క్రౌడ్‌స్ట్రయిక్ బగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 లక్షల కంప్యూటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకు, వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడింది.
రెండు రిపేర్ ఆప్షన్లతో విన్పీఈ రికవరీ టూల్‌ను రిలీజ్ చేశారు. ఐటీ అడ్మిన్లు.. ఈ టూల్‌తో రికవరీ ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు. ఈ టూల్‌ను వాడేందుకు.. మీ కంప్యూటర్లలో విండోస్ 64 బిట్ ప్రాసెసర్ ఉండాల్సిందే. దీంతో పాటు కనీసం 8 జీబీ స్పేస్ కూడా ఉండాలి. 1 జీబీ స్టోరేజ్ ఉన్న యూఎస్బీ డ్రైవ్ కూడా అవసరం ఉంటుంది. బిల్లాకర్ రికవరీ కీ కూడా అవసరం. యూఎస్బీ లో ఉన్న డేటా మొత్తం వెళ్లి.. అటోమెటిక్‌గా సిస్టమ్ ఫాట్32కు ఫార్మాట్ అవుతుంది.