తిరువనంతపురం: కేరళలో బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన మెట్రో మ్యాన్ శ్రీధరన్ ఓడిపోయారు. పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కౌంటింగ్ ఆరంభంలో సుమారు నాలుగు వేలకుపైగా ఓట్లతో లీడ్లో ఉన్నారు. అయితే చివరకు శ్రీధరన్ ఓడిపోయారు. కాంగ్రెస్ సిట్టింగ్ శాసనసభ్యుడు షఫీ పారాంబిల్ విజయం సాధించి తన స్థానాన్ని నిలుపుకున్నారు. మరోవైపు కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. మంజేశ్వర, కొన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన తొలి నుంచి వెనకబడి ఉన్నారు.