న్యూఢిల్లీ :భారత ఎన్నికలపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలకు మెటా ఇండియా బుధవారం భారత్కు క్షమాపణ చెప్పింది. 2024లో జరిగిన ఎన్నికలలో భారత్లోని అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయిందంటూ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నట్టు మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివ్నాథ్ తుక్రల్ తెలిపారు.
ఇది అనుకోకుండా జరిగిన పొరపాటని ఆయన సంజాయిషీ ఇచ్చారు. 2024 ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీలు తిరిగి గెలవలేదంటూ మార్క్ చేసిన వ్యాఖ్యలు అనేక దేశాలకు సంబంధించి వాస్తవమేనని తెలిపారు. అయితే భారత్కు మాత్రం ఇది వర్తించదని ఆయన తెలిపారు.